సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం… మంత్రి భరత్
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం
పోతిరెడ్డిపాలెంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో మంత్రి భరత్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ప్రతి ఇంటా సంతోషం.. ప్రభుత్వ పథకాల అమలుపై హర్షం
రాష్ట్రంలో ఏడాదిలో 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు
రూ.1.50 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రశాంతమ్మ భేష్
అసెంబ్లీ సమావేశాల్లో కోవూరు సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారం చూపుతున్నారు
సమస్యలపై పోరాడే నాయకులు ఉండటం మీ అదృష్టం
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్
సుపరిపాలన సాధన సీఎం చంద్రబాబు గారికే సాధ్యం
ప్రతి ఇంటా సంతోషం నింపారు..
ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పదిలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలంలో చేసిన మంచిని వివరించేందుకు ప్రజల మధ్యకు వచ్చినట్లు ఆయన వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు వచ్చిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ కోవూరు
ప్రశాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా పోతిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం.. రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పోతిరెడ్డిపాలెం బ్రాంచ్ రోడ్డు, పోతిరెడ్డిపాలెం నుంచి గిరిజన తిప్ప వెళ్లే రోడ్లను ఎమ్మెల్యే తో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు. అనంతరం పోతిరెడ్డి పాలెం గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేశారు.
పోతిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీవాణి కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మంత్రి భరత్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ.. ఆప్యాయంగా పలకరించారు. సుపరిపాలన కరపత్రాలు అందించి ఏడాదికాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న వారి కళ్లలో సంతోషం చూశారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని నేతలు ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ… కోవూరు నియోజకవర్గ సమస్యలే పరిష్కారంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పనిచేస్తున్నారని, ఆ విషయాన్ని తాము ప్రత్యక్ష్యంగా చూస్తున్నామన్నారు. ఎప్పుడు ఎక్కడ పలకరించినా.. ప్రజా సమస్యలనే ప్రస్తావిస్తుంటారన్నారు.ఎమ్మెల్యే పనితీరును ఆయన కొనియాడారు. గత పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గారు గాడిన పెడుతున్నారన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పినా వారి తీరు మారడం లేదని, ఇటీవల ప్రశాంతమ్మను అసభ్య పదజాలంలో మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు.
సీఎం, ఒక విజన్‌తో పాలన సాగిస్తున్నారని, ఆయన విజన్‌కు నేటి హైదరాబాద్ నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వాలు అత్యవసరమని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే రావాలన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అని చెప్పారు. ఇది పనిచేసే ప్రభుత్వమని, ఎంజాయ్ చేసే ప్రభుత్వం కాదన్నారు. ఈ రాష్ట్రానికి ఉన్న సీఎం మరే రాష్ట్రానికి లేరని, అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనే మన సీఎం అన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇఫ్కో కిసాన్ సెజ్ వివరాలపై ఆరా తీస్తామని అన్నారు.
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని మొదలు పెట్టిన 20 రోజుల్లోనే లక్ష ఇళ్లను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో తమను భారీ మెజారిటీలతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి మీ వద్దకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి నేడు ప్రజాక్షేత్రంలో ధైర్యంగా తిరుగుతున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80% వరకు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్థం అయిన రాష్ట్రాన్ని సీఎం తన పాలనానుభవంతో గాడిన పెడుతున్నారన్నారు. 1వ తేదీనే పింఛను, దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, వేట నిషేధ సమయంలో మత్స్యకార సేవ కింద 20 వేల ఆర్థిక సహాయం వంటి అన్ని పథకాలు అమలు చేశారన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు, ఇఫ్కో కిసాన్ సెజ్, మిథాని పరిశ్రమల స్థాపన విషయాన్ని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు. కోవూరు నియోజకవర్గంలో నైపుణ్యమున్న యువతకు కొదవ లేదని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ సెజ్, మిథాని పరిశ్రమలు స్థాపిస్తే వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.


