సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం… వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

0

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సుపరిపాలనలో తొలిఅడుగు “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందించారు. టిడిపి శ్రేణులు 1 లక్ష 20 వేల ఇళ్లకు తిరిగి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాయలను చేరవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కనుపర్తిపాడు లోని విపిఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆమెl ప్రసంగించారు. కార్యకర్తే అధినేత అన్న లోకేష్ నినాదమే తనకు ఆదర్శమన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు సుశిక్షితులైన సైనికులు అని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఏడాది కాలంలో కూటమి పాలనలో సాధించిన విజయాలను గడప గడపకు చేర్చడంలో అంకితభావంతో పని చేసిన పార్టీ శ్రేణులను అభినందించారు.

ప్రభుత్వ లక్ష్యాలను చంద్రబాబు నాయుడు విజన్‌ను ప్రజలకు వివరించి పార్టీకి ప్రభుత్వానికి వారధిలా నిలిచారని ప్రశంసించారు. సుపరిపాలనలో తొలిఅడుగు “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన, యిదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. అధికారం చేపట్టిన 13 నెలల కాలంలో సభ్యత్వ నమోదు మొదలు బూత్ లెవల్ కన్వీనర్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు దాకా నియామకాలు చేసుకొని క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేసుకున్న క్రమాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. కొత్త, పాత సమన్వయంతో ఐకమత్యంగా ముందుకు సాగాలని అన్నారు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా జండా మోసిన కార్యకర్తల త్యాగాలను విస్మరించన్నారు, పార్టీలో సీనియర్లకు సముచిత గొరవం యిస్తానన్నారు. తనకు ఎవరి పట్ల వివక్ష లేదని అందరూ సమానమేనన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాటలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. ఎవరు నిరుత్సాహ పడొద్దని కార్యకర్తలే పార్టీకి పునాది అని చాటి చెప్పిన మీ త్యాగాలను గుర్తించి పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకు దశల వారీగా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ యిచ్చారు. కార్యకర్తలకు ఏ సమస్య వున్న నిస్సంకోచంగా తన దృష్టికి తేవాలని కోరారు. తెలిసో తెలియకో తన వల్ల ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే మన్నించాలన్నా

రు. నిత్యం ప్రజలలో వుండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నాయకులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ కన్వీనర్లు, క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు. .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *