సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్ధులను అభినందించిన : మంత్రి జనార్థన్ రెడ్డి
అమరావతి: సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ (SCIENCE EXPOSURE TOUR TO NEW DELHI) కార్యక్రమానికి ఎంపికైన విద్యార్ధులను అభినందించిన మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి


సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్ టూ న్యూఢిల్లీ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్ధినివిద్యార్ధులతో నేడు విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని వారికి అభినందనలు తెలిపిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, I&I శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్షా AP SPD శ్రీనివాస్ & సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు తదితరులు.
ఈ సందర్భంగా విద్యార్ధులనుద్దేశించి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సైన్స్ సిటీ & సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం సంతోషకరం
సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహానికి ఇదే నిదర్శనం
సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకే విద్యార్థి దశలోనే శాస్త్రీయ దృక్పథం & సైన్స్ టెక్నాలజీపై చిన్నారుల్లో ఆసక్తిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం
ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు తొలిసారి విమాన ప్రయాణ అనుభూతిని అందిస్తోన్న ఘనత సైతం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానిదే
ఈ నెల 6 నుంచి 8 తేదీ వరకు జరిగే ఈ టూర్ లో నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యా సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ సందర్శన ద్వారా విద్యార్ధుల్లో సైన్స్ & టెక్నాలజీ అవగాహన పెరుగుతుంది
విద్యార్ధులంతా తమ ఆలోచనలకు సరైన రీతిలో పదును పెడితే భవిష్యత్తులో మీరే ఒక సత్య నాదెళ్ల, సుందర్ పిచ్ఛయ్ లా ఆకాశమే హద్దుగా ఎదుగుతారు
ఈ టూర్ విద్యార్ధుల బాల్య జీవితంలో ఒక అపూర్వఘటనగా మిగిలిపోతుంది.
పుస్తకాలు, టీచర్లు బోధించే విద్యకే పరిమితం కాకుండా ప్రాక్టీకల్ గా సైన్స్ & టెక్నాలజీని అర్ధం చేసుకోవడానికి ఈ టూర్లు ఎంతో ఉపయోగకరం
నాసాకు చెందిన ఇంజనీర్లు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మీ ఆలోచనలు పంచుకోవడానికి విద్యార్ధి జీవితంలో మీకు దొరికిన గొప్ప అవకాశం
ఎడ్యుకేషన్ టూర్ లు విద్యార్ధుల్లోని సృజనాత్మకత, సరికొత్త ఆవిష్కరణలు, క్లిష్టతరమైన ఆలోచన విధానాలను పెంచుతాయి
గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను ప్రోత్సహించే విధంగా ఏపీ సైన్స్ సిటీ చేపట్టే కార్యక్రమాలను ప్రభుత్వం అన్ని విధాలుగా, అండగా నిలుస్తోంది
విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో పాటు, టెక్నాలజీ రంగంలో సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ (SCAP) & సమగ్ర శిక్ష అభియాన్ కు అభినందనలు
