20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ ఈనెల 24న జిల్లాకు రాక
20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ ఈనెల 24న జిల్లాకు రాక
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు జిల్లా: 20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఈనెల 24న జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24న ఉదయం 3.30 గంటలకు సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి ఉదయం 7.08 గంటలకు నెల్లూరుకు చేరుకొని గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 వరకు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆరోగ్య, విద్య రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు
అమృత్ పథకం, జల్ జీవన్ మిషన్,ప్రధాన్ మంత్రి సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల పురోగతి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతారు.
తిరిగి సాయంత్రం 04.35 గంటలకు వందే భారత్ లో నెల్లూరు నుండి బయలుదేరి రాత్రి 07.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.
