2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు

0

అమరావతి: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఆం రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రోజువారీ లక్ష్యాలను మరింత పెంచి, 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా నది జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మంత్రి నిమ్మల రామానాయుడు కాంపెక్స్ లెనింగ్ పనులను స్వయంగా తనిఖీ చేశారు. టన్నెల్ లైనింగ్, ఫీడర్ కెనాల్ నిర్మాణం, డైవర్షన్లు మరియు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత 18 నెలల్లో టన్నెల్స్లో 3 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తయినట్టు వివరించారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల లైనింగ్ పని జరుగుతోందని, నాలుగు గాంట్రీలతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పనులతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి మరో రూ.4 వేల కోట్లు అవసరమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందుతుందని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇన్ని పెండింగ్ పనులు ఉండగా, మునుపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టును పూర్తయినట్టు చెప్పి జాతికి అంకితం ఇవ్వడం ఎంతో విడ్డూరమని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇది ప్రజలను మోసం చేసినట్టున్నదని, అలాంటి చర్యలు ఎంత వింతగా ఉన్నాయో ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును నిజంగా పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *