66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ
: తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి ధరకాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ హై కోర్ట్ రిజిస్ట్రార్ తెలియ చేశారు.
ఈ సివిల్ జడ్జి ల (జూనియర్ డివిజన్ ) పోస్టులకు డిసెంబర్ 8 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్యలో దరఖాస్తులను ఆన్-లైన్ ద్వారా పంపాల్సి ఉంటుందని తెలిపారు.
ఈపోస్టుల పరీక్ష తేదీలు, హల్ టికెట్ల డౌన్ లోడ్, కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష తదితర వివరాలను వెబ్-సైట్ లో ప్రకటించడం జరుగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు.
ఈ నోటిఫికేషన్ వివరాలను హై-కోర్ట్ వెబ్సైట్ http://tshc.gov.com లో ఉంచడం జరిగిందని ఒక ప్రకటనలో తెలియచేసారు.
