రాసిపెట్టుకోండి, కలిసే ఉంటాం – రెడ్ బుక్ లో నెక్స్ట్, వదిలేది లేదు..!
రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడులో జరిగిన బహిరంగ సభలో లోకేష్ కీలక ప్రసంగం చేసారు. వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశార ని చెప్పుకొచ్చారు. టీడీపీ లో కార్యకర్తే అధినేత అని లోకేష్ స్పష్టం చేసారు. ఆరు శాసనాలే శ్వాసగా పని చేస్తామని.. కార్యకర్తలు ఎప్పుడైనా తనను కలవచ్చని వెల్లడించారు. పవన్ తనకు అన్న లాంటి వారని.. కూటమి లో విడాకులు ఉండవని తేల్చి చెప్పారు.కార్యకర్తే అధినేతమంత్రి లోకేష్ తమ భవిష్యత్ వ్యూహాలను పార్టీ మహానాడు సభలో స్పష్టం చేసారు. టీడీపికి అధికా రం కొత్త కాదు , ప్రతిపక్షం కొత్త కాదు. కానీ 2019 నుండి 2024 వరకూ విధ్వంస పాలన ఎదుర్కొ న్నామని గుర్తు చేసారు. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్ట్. మన అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. నాయకులు, కార్యకర్తల పై వేల కేసులు, అరెస్టులు జరిగాయన్నారు. కడప మాస్ జాతర మహానాడు అదిరిపోయిందని.. పౌరుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జించిందని చెప్పారు.
2024లో మాస్ విక్టరీ సాధించాం, రికార్డులు బద్దలు కొట్టాం… చరిత్రను తిరగరాసామని వివరించారు.94 పర్సెంట్ స్ట్రైక్ రేట్…164 అవుటాఫ్ 175 గా చెప్పుకొచ్చారు. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్ అని చెప్పారు.టీడీపీ నాటుదెబ్బఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటుదెబ్బ అని లోకేష్ పేర్కొన్నారు. మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆరుశాసనాలను పొలిట్ బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషిచేయాలని సూచించారు. సమస్యలుంటే ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలన్నారు. స్థానికంగా సాధ్యం కాకపోతే మా దృష్టికి తీసుకువస్తే మేమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూటమి ఏర్పడిందన్నారు. ప్రజల కోసం ప్రధాని మోదీ , జనసేన అధినేత పవనన్న, మన చంద్రన్న జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి కలిసి పనిచేసారని.. ప్రజలు కూటమిని ఆశీర్వదించారని చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తామని వెల్లడించారు. కడప మేయర్ తొలిగింపు పై హైకోర్టు స్టే..!!కలిసే ఉంటాం16,347 పోస్టులతో మెగా డీఎస్సి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడి వాటి ద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేసారు. నామినేటెడ్ పదవులు అన్ని ఒక్క పద్ధతి ప్రకారం ఇస్తున్నామని వెల్లడించారు. సీనియర్ల ను, జూనియర్స్ ను గౌరవిస్తానని చెప్పిన లోకేష్..పనిచేసేవారినే ప్రోత్సహిస్తానని స్పష్టం చేసారు. రెడ్ బుక్ పేరుచెప్పగానే ఒకడికి గుండె పోటు వచ్చింది, మరొకడు బాత్రూమ్ లో కాలిజారిపడ్డాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీరందరికీ తెలుసు, అర్థమైందా రాజా? అని ప్రశ్నించారు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసిన తప్పులను ఎస్టాబ్లిష్ చెయ్యాలని… దానికి సమయం పట్టొచ్చు.. కానీ శిక్ష తప్పదు… ఎవ్వరూ తప్పించుకో లేరని లోకేష్ పేర్కొన్నారు.
