ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందనలు
అమరావతి: ప్రముఖ వార్తా సంస్థ ‘ఎకనామిక్ టైమ్స్’ నుంచి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ముఖ్యమంత్రి దక్షతకు ఈ అవార్డు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. “ముఖ్యమంత్రి పరిపాలనా దక్షతను గుర్తించి ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణం. ఆయన దార్శనికతకు, ఆర్థిక సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతకు దక్కిన సరైన గౌరవం ఇది,” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని స్పీకర్ ఆకాంక్షించారు. తన తరపున, శాసనసభ తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు.
