కోడి గుడ్ల ధరలకు రెక్కలు… హోల్‌సేల్‌లో ఒక్కోటి రూ.7.30.. బహిరంగ మార్కెట్‌లో రూ.8

0

పౌల్ట్రీ చరిత్రలోనే ఇదే అత్యధికమంటున్న వ్యాపారులు

ఉత్పత్తి తగ్గడం వల్లే పెరుగుతున్న రేట్లు

కోడి గుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30పై పలుకుతుండడం గమనార్హం. పౌల్ర్టీ రంగ చరిత్రలోనే ఇదే రికార్డు ధరని పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క, సామాన్యులు మాత్రం గుడ్డు ధరలు విని అమ్మో అంటున్నారు. గతంలో 30 కోడిగుడ్లు రూ.160-170 వరకు విక్రయించేవారు. 10 రోజులుగా 30 కోడి గుడ్లను రూ. 210-220 వరకు హోల్‌సెల్‌ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్లు అయితే ఒక్కో గుడ్డును రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడం వల్లే కోడి గుడ్ల ధరలు పెరిగిపోతున్నాయని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో కలిపి రోజుకు సుమారు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. అయితే, కోడి గుడ్ల ఉత్పత్తికి అవసరమయ్యే దాణ, మక్కలు, చేపపొట్టు వంటి వాటి ధరలు పెరిగిపోవడంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణ ఆపేశారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రతి రోజు కనీసం 20 కోట్ల గుడ్లు కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ ఉండేవని ఇప్పుడా పరిస్థితి లేదని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదే ఆల్‌టైమ్‌ గరిష్ఠ ధర

ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర హోల్‌సేల్‌లోనే రూ.7.30, రిటైల్‌లో రూ.8పలుకుతోంది. పౌలీ్ట్ర చరిత్రలోనే కోడిగుడ్డుకు ఇంత ధర ఎప్పుడూ లేదు. మరో రెండు నెలలు ఇదే ధర ఉంటుందని భావిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *