టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు మీడియా సమావేశం.
తిరుమల: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం 2 నెలలుగా అధికారులు పనిచేస్తున్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రుల సబ్ కమిటీ కూడా టీటీడీతో నిరంతరం సమీక్షిస్తోంది.
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, టోకెన్లు లేని వారికి తిరుమలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి.
తిరుమలకు భక్తుల అనుమతిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదు. మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తాం.
జనవరి 2 నుంచి 7 వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి. భక్తుల సౌకర్యం, భద్రత దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేసింది.
వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కోరుతున్నా : టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు
