చమురు కొరత.. అంత్యక్రియలు నిలిపివేత
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా థాయ్‌లాండ్‌లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం వాట్ మహాథాట్‌లో అంత్యక్రియలు నిలిచిపోయాయి. భారీగా ఇంధనాన్ని అమ్మేందుకు పెట్రోల్ బంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ కట్టెలకు బదులు డీజిల్‌ను వాడతారు. ప్రతి దహన సంస్కారానికి 90 లీటర్ల ఇంధనం అవసరం. ప్రతి నెలలో ఈ ఆలయంలో 10 మంది అనాథలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు.
