సుబ్బానాయుడు ఆకస్మిక మృతిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిగ్భ్రాంతి
సుబ్బానాయుడు ఆకస్మిక మృతిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లా: టీడీపీ సీనియర్ నాయకులు, ఆప్తులు, పార్టీకి విశేష సేవలు అందించిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆకస్మిక మృతి తీరని లోటని, ఆయన హఠాన్మరణనం బాధాకరమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మంచి మనిషిగా, తెలుగుదేశం పార్టీ దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ ఇన్ చార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీకి సుబ్బానాయుడు అందించిన సేవలు మరువలేనివని, ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని, బాధాకర సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మధైర్యం ఇవ్వాలని అన్నారు.
