స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉద్యోగాల ఇంటర్వ్యూ వాయిదా
స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉద్యోగాల ఇంటర్వ్యూ వాయిదా
స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జివిబిడి హరిప్రసాద్
స్త్రీనిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల ఇంటర్వ్యూలను తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జివిబిడి హరిప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
“సైక్లోన్ మొంథా (Cyclone Monthal) నేపధ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్త్రీనిధి ఏ.పీ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 28 నుండి 31 వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా
వేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 28,29,30,31 తేదీల్లో నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను డిసెంబర్ 01, 02, 03, 04 తేదీలలో నిర్వహించడం జరగుతుందన్నారు. అయితే నవంబర్ 1 నుండి 29 వరకు నిర్వహించే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ లో ఎలాంటి మార్పు లేకుండా యదావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూకు ఎంపిక అయిన అబ్యర్థులకు ఇప్పటికే కాల్ లెటర్స్ పంపడం జరిగిందని, రిజిస్టర్ నెంబర్ ఆధారంగా కాల్ లెటర్స్ AP-online వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జివిబిడి హరిప్రసాద్ ఆ ప్రకటనలో తెలియజేశారు.,
