పదవ తరగతి విద్యా అర్హత తో ఆర్టీసీలో ఉద్యోగాలు!
పదవ తరగతి విద్యా అర్హత తో ఆర్టీసీలో ఉద్యోగాలు!
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ ఖాళీల భర్తీకి ఇటీవల స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి పదో తరగతిలో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ పేర్కొంది.
ఆ తర్వాత ఎట్టి పరిస్థితు ల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు కోసం ఈ కింద చెక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,743 డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలను ఆర్టీసీ భర్తీ చేయనుంది. వీటిల్లో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలని అధికారులు తెలిపారు .
అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
