వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటన
మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు
. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. తుపాన్‌లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ నిలుస్తుందని జగన్ ప్రకటించారు.
