రేపు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దగదర్తి రాక

రేపు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దగదర్తి రాక…కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు దగదర్తికి రానున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9.30 గంటలకు కావలి నియోజకవర్గం దగదర్తికి చేరుకుంటారు. దగదర్తిలో ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
