ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ
ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ముద్రగడ

అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ తీసుకువెళ్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ తీసుకువెళ్తారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్‌లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని, అయితే రోడ్డుమార్గం అంత శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో సోమవారం ఉదయం హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
