రాముడిని రావణాసురుడిని చేయకండి. రాముడు లాగే ఉండనివ్వండి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
అన్నమయ జిల్లా, రాయచోటి :
రాముడిని రావణాసురుడిని చేయకండి. రాముడు లాగే ఉండనివ్వండి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
మీ తాతలు తండ్రులకే భయపడిన వ్యక్తిని కాదని గుర్తుపెట్టుకోండి.. రాయచోటి గడ్డ… వైసిపి అడ్డా… అన్నే ప్రాంతంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తిని.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను నమ్మి నాపై గొప్ప బాధ్యతను అప్పగించారు. వైఎస్ఆర్సిపి నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉందని తెలిసినా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి.
గొడవలు…కేసులు నాకేం కొత్తవి కాదు… వైసిపి చెంచాలు ఎంతమంది కలిసి వచ్చిన భయపడే వ్యక్తిని కాదు. పుంగనూరు వైసిపి గొడవలో ఎదురొడ్డి నిలబడ్డవాన్ని. గెలిచిన క్షణం నుండి అన్ని విధాల నియోజకవర్గ అభివృద్ధి కొరకై అనుక్షణం చిత్తశుద్ధితో పనిచేస్తూన్న వ్యక్తిని..
తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్టులుగా పనిచేసే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ప్రజల మనసు గెలవలేక నాపై నిందలు వేయడం సరికాదు.శాసన సభ్యునిగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధి పై ఏ వేదికనుండైనా చర్చకు నేను రెడి.!
తెలుగుదేశం పార్టీ ఉగ్గుపాలు తాగి కాసుల కోసం వైసీపీకి అమ్ముడుపోయిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి.
టీడీపీ ఇంచార్జీగా ఉన్న ఐదేళ్ళ కాలంలో నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి రమేష్ రెడ్డి. 34 మార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేని పరిస్థితిలో రమేష్ రెడ్డి.
గుర్తుపెట్టుకో నిన్ను బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాబోవు మున్సిపల్ ఎలక్షన్లలో మీరేంటో నిరూపించుకోండి. సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన, అసత్య ప్రచారాలు చేసిన, ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు.
