ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో మారుతున్న రాష్ట్ర రూపురేఖలు : మంత్రి నారాయణ

0

నెల్లూరు జిల్లా: తమ ప్రభుత్వం అధికారంలో రాగానే సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టమని ఆదేశించినట్లు రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. దిత్వా తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వర్షాలు వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ టిడిపి నేతలు దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే సాయం అందజేస్తామని మంత్రి భరోసా కల్పించారు. అందులో భాగంగా ముందుగా 13వ డివిజన్ ప్రణతి అపార్ట్మెంట్ వద్ద సైడ్ కాలువలను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతరం 8వ డివిజన్ రెబల వారి వీధిలోని పార్కుల ఆధునీకరణ పనులను పరిశీలించారు. పార్కులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ జిమ్లను పర్యవేక్షించి పలు మార్పులు చెయ్యాలని చెప్పారు. అయితే అక్కడ చేరుకున్న స్థానికులు అభ్యర్థన మేరకు పార్కు సమీపంలో సైడ్ రెయిన్ ఏర్పాటుకు మంత్రి నారాయణ ఆమోదం తెలిపారు.. తదనంతరం ఆత్మకూరు బస్టాండ్ అండర్ పాస్ వద్ద రోడ్డు పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సిరి థియేటర్ వద్ద జరుగుతున్నటువంటి కమ్యూనిటీ హాల్ పనులను అనంతరం పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ ముందున్న ట్రాన్స్ఫార్మ్ని వెనకాల వైపునకు మార్చాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా అమరావతి హోటల్ సందులో నిర్మిస్తున్న సైడ్ రైన్ సిమెంట్ రోడ్డు పనులను కూడా మంత్రి పరిశీలించారు.
అయితే వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించటం జరిగిందన్నారు. డ్రైన్లలో సిల్టు తీయటం వల్ల నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలువలేదని తెలిపారు. పనులన్నీ పూర్తయితే నెల్లూరుకు ముంపు సమస్య తీరిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలపై దృష్టిపెట్టమని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలియజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 150 కోట్లతో కాలువల పూడికతీత పనులు చేపట్టామన్నారు. తనకున్న అపార అనుభవంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ముఖ్యమంత్రి గాడిలో పెడుతున్నారని తెలియజేశారు. ప్రజలు కాస్త ఓపిక పడితే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనురాధ రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *