‘అఖండ-2 తాండవం’ : మన బాలయ్య – మనందరి బాలయ్య ఊరమాస్ విధ్వంసం..!
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర.. వారి కాంబినేషన్లో నాలుగో సినిమాగా వచ్చిన ‘అఖండ-2’ ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా, అభిమానులకు పూనకాలు ఖాయంగా.. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
ఇది కేవలం సీక్వెల్ కాదు.. మాస్ సినిమాకు ఒక కొత్త ఎలివేషన్..!
సినిమాకు నందమూరి బాలకృష్ణ అభినయం ఆయువుపట్టు ముఖ్యంగా ఆయన అఘోరా ‘అఖండ’ పాత్రలో తెరపైకి వచ్చిన ప్రతిసారీ థియేటర్‌లో విజిల్స్, కేకలు.
బాలయ్య తనదైన పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో మూడు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. కొన్ని యాక్షన్ బ్లాక్‌లలో ఆయన విశ్వరూపం చూసి మాస్ ఆడియన్స్ మైమరిచిపోతారు.
దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి ‘అఖండ’ యూనివర్స్‌ను మరింత విస్తృతం చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్సలెంట్ – అసలు తాండవం ఇక్కడే మొదలవుతుంది, క్లైమాక్స్ ఫైట్, ఇవన్నీ విజువల్‌గా చాలా గ్రాండ్‌గా, పవర్ఫుల్‌గా ఉన్నాయి.
‘అఖండ-2 తాండవo’ బాలయ్య బాబు అభిమానులకు కన్నుల పండుగ. మాస్ యాక్షన్, హై-వోల్టేజ్ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, ఆధ్యాత్మిక భావోద్వేగాలు కోరుకునే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రం.
