అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం?
అల్లూరి జిల్లా: ఏపీలో మరో పెను విషాదం చోటుచేసుకుంది శుక్రవారం తెల్లవారుజాము న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
స్థానికుల సమాచారం మేరకు…చిత్తూరు జిల్లా విగ్నేశ్వర ట్రావెల్ కు చెందిన ఏపీ 39,UM 65 43, నెంబర్ గల ప్రైవేట్ ట్రావెల్ బస్సు 37 మందితో భద్రాచలం నుంచి అరకు వెళుతుంది మార్గం మధ్యలో మారేడుమిల్లి ఘాటు రోడ్డు లోని రాజు గారి మెట్టు మలుపు వద్ద అదుపుతప్పి బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదముతో అప్రమత్త మైన స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన వారిని అత్య వసర చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెల్లవారు జామున 3గంటల సమయంలో కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద ప్రయాణికుల హార్థనదాలు
మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని స్థానికులతో కలిసి సహా యక చర్యలు చేపట్టారు.
కొండ ప్రాంతం ప్రదేశం కావడం ఘాట్ రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికశాతం మంది 50ఏళ్ల వయస్సు పైబడిన వారేనని తెలుస్తోంది.
