I Bomma రవి కేసు వాదించే లాయర్ కు పాలాభిషేకం చేస్తామంటున్న నెటిజన్లు!

0

I Bomma రవి కేసు వాదించే లాయర్ కు పాలాభిషేకం చేస్తామంటున్న నెటిజన్లు!

తెలంగాణ: దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి అతనిని విచారణ చేస్తున్నారు. ఐ బొమ్మ, బప్పం టీవీతో పాటు 65కు పైగా పైరసీ వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఒకపక్క కృషి చేస్తుంటే మరోపక్క సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి మద్దతు పెరుగుతుంది.

రవి కేసును వాదిస్తున్న జగన్ కోడికత్తి కేసు లాయర్

ఈ క్రమంలోనే ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి, గులకరాయి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పించిన న్యాయవాది సలీం ఇప్పుడు ఐ బొమ్మ రవి కేసును స్వీకరించారు. చట్టప్రకారం రవిని అరెస్ట్ చేసినట్టే, అదే చట్టం ప్రకారం నిందితుడి తరపున వాదనలు వాదించడం కోసం తాను ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. రవి తల్లిదండ్రులతో తాను మాట్లాడానని, కేసులో అతని తరుపున వాదిస్తానని పేర్కొన్నారు.

నిందితుడి హక్కుల కోసం వాదిస్తా:

నిందితుడి హక్కుల కోసం తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని ఇమ్మడి రవి తెలిపారు.ఇక పోలీసులు హీరోలుగా నిలబడాలంటే, విలన్ కూడా అంతే ధైర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *