సీఎం పాలనానుభవంతో రాష్ట్రాభివృద్ధి

0
IMG-20250721-WA0293

సీఎం పాలనానుభవంతో రాష్ట్రాభివృద్ధి

నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు

ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమాన్ని వివరించేందుకే సుపరిపాలనలో తొలి అడుగు

కావలి రూరల్ మండలం చలంచర్లలో ఇంటింటి ప్రచారం

పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

6 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనానుభవంతోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు. కావలి నియోజకవర్గంలోని చలంచర్ల గ్రామం లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి తో కలిసి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. చలంచర్ల పంచాయతీలో రూ.6 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తల్లికి వందనం, పింఛన్లు వంటి పథకాల అమలుపై ప్రజలను అడిగి అభిప్రాయాలు సేకరించారు. సీఎం చంద్రబాబు పాలన బాగుందా అని తెలుసుకున్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.. ప్రజల సమాధానాలపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు.

ఇంటింటికి తెలుగుదేశం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు. ఈ ఏడాది కాలంలో 20 సార్లు ఢిల్లీ వచ్చిన సీఎం.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నారని వివరించారు. నిత్యం కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధిస్తుంటారని పేర్కొన్నారు. ఇంతలా కష్టపడి పనిచేసే సీఎం పాలనలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.

కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎంతో కష్టపడుతున్నారని, దాదాపు 6 కోట్లరూపాయల, అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కావలి నియోజకవర్గం తన సొంత ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్దికి తప్పకుండా కట్టుబడి ఉన్నామన్నారు. బిపిసిఎల్‌, దగదర్తి ఎయిర్‌పోర్ట్‌ వంటి ప్రాజెక్టులతో కావలిలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజలను పేరు పెట్టి పిలవడం అమితానందాన్ని ఇస్తోందన్నారు. 2018లో చలంచర్ల గ్రామంలో విపిఆర్‌ అమృత ధార వాటర్‌ ప్లాంట్‌ పెట్టామని, నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా పనిచేస్తోందన్నారు. గ్రామంలో ప్రజల ఆప్యాయతానురాగాలు మర్చిపోలేమని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 వాటర్ ప్లాంట్లను స్థాపించామని పేర్కొన్నారు. కావలి అభివృద్ది గురించి ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చర్చించానని, కచ్చితంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చలంచర్ల గ్రామం తనను అక్కున చేర్చుకుందని, అందుకే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామన్నారు. ఇంకా అనేక పనులు పూర్తి చేయాల్సి ఉందనారు. చలంచర్ల రోడ్డు నిర్మాణం పూర్తయిందని, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇస్తున్నామన్నారు. సిరిపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. వేమిరెడ్డి కి పబ్లిసిటీ అంటే నచ్చదని, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిని ఆదుకుంటారన్నారు. 2018లో ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీరు అందించారని గుర్తు చేశారు. కావలి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *