ఇళ్ల నిర్మాణానికి రూ.15,000 కోట్లు!
ఢిల్లీ
: కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘స్వామి-2’ (SWAMIH-2) నిధిని త్వరలో ప్రారంభించనుంది. దాదాపు రూ.15,000 కోట్ల భారీ నిధితో సుమారు లక్ష మంది మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో ప్రారంభించిన ‘స్వామి-1’ ద్వారా ఇప్పటికే 55,000 ఇళ్లను పూర్తి చేశారు. ఈ పథకం ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టులకు చివరి దశ నిధులను
అందిస్తుంది.
