ఈ నెల 7 నుంచి రెండు వారాలు యూనివర్సిటీకి సెలవులు
గుంటూరు జిల్లా/మంగళగిరి:
ఈ నెల 7 నుంచి రెండు వారాలు యూనివర్సిటీకి సెలవులు
ఏపీ ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీకి ఈనెల 7వ తేదీ నుంచి 23 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని, వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అంతటా సమగ్రంగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ప్రకటన లో పేర్కొన్నారు.
ఈ రోజుల్లో మెస్ తో పాటు వంట గదులు, హాస్టళ్లు మొత్తం పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు.
సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు.
