ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం

0

జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం

అనూప్‌గఢ్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని స్పానర్స్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని హెచ్చరించారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారీ చూపించలేవని అన్నారు. ఈసారి నిర్ణయాత్మక,అత్యంత శక్తివంతమైన సమాధానం ఇస్తుందని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సంయమనాన్ని ఈసారి చూపించం. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటోందో, లేదో తేల్చుకునేలా ఈసారి పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఉంటుంది. ప్రపంచ పటంలో పాక్ ఉండదలిస్తే మాత్రం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం ఆపితీరాలి’ అని జనరల్ ద్వివేది అన్నారు.

బికనీర్ మిలట్రీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మిలట్రీ సీనియర్ అధికారులు, వెటరన్స్, సివిల్ డిగ్నటరీలతో ఆయన సమావేశం అయ్యారు. ఆధునికీకరణ, యుద్ధ సన్నాహకాలు, అడ్వాన్సింగ్ టెక్నలాజికల్ సామర్థ్యాలు, ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్‌కు ఆర్మీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *