ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు
ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు
తెలంగాణ: ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం డీసీసీ పదవులు 50%కి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కుతాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అత్యధికంగా కొత్త తరం నాయకులు, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్ లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ ఇవ్వడం జోడు పదవుల కిందికి రాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల పేర్లు డీసీసీలకు పరిగణనలో ఉన్నాయని తెలిపారు. కాగా ఈ నెలాఖరులోపు డీసీసీ పదవులు ప్రకటించే అవకాశం ఉంది.
