ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘటనపై ఆరా తీసిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి:
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘటనపై ఆరా తీసిన మంత్రి కందుల దుర్గేష్

ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆవేదన
ఈ ఘటనపై విభిన్న కోణాల్లో విచారణ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచన
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘటనపై లండన్ పర్యటనలో ఉన్న గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై విభిన్న కోణాల్లో క్షుణ్ణంగా విచారణ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి మంత్రి దుర్గేష్ ఫోన్ ద్వారా పలు సూచనలు చేశారు.
