ఏపీలో గంటకు రూ.8.54 లక్షల సైబర్ దోపిడీ

0

అమరావతి: ఏపీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా రూ.756.40 కోట్లు దోచుకున్నారు.

సగటున గంటకు రూ.8.54 లక్షలు, రోజుకు రూ.2.05 కోట్లు పోగొట్టుకుంటున్నారు.

డిజిటల్ మోసాలు, క్రెడిట్/డెబిట్ కార్డులు, ఓటీపీ, క్రిప్టోకరెన్సీ, వర్క్‌ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ పెట్టుబడులు, న్యూడ్ వీడియో కాల్స్ వంటి వాటితో అమాయకులను మోసం చేస్తున్నారు.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ప్రకారం ఈ లెక్కలు వెల్లడయ్యాయి.

బాధితుల నుంచి దోచుకున్న డబ్బులో కేవలం 0.29 శాతం మాత్రమే రికవరీ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *