కడప మేయర్‌ ఎన్నికకు గ్రీన్‌సిగ్నల్‌: హైకోర్టు స్టే నిరాకరణతో తొలగిన అడ్డంకులు

0

కడప: కడప మేయర్‌ ఎన్నికకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. మేయర్‌ ఎన్నికపై ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ మాజీ మేయర్‌ సురేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

ఈ దశలో మేయర్‌ ఎన్నికకు స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రేపు యథావిధిగానే కడపలో కొత్త మేయర్‌ ఎన్నిక జరగనుంది.

ఈ తీర్పుతో నగర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *