గుంటూరు జిల్లాకు,రక్షణ కవచంలా ‘ఆ ఇద్దరు
గుంటూరు జిల్లాకు,రక్షణ కవచంలా ‘ఆ ఇద్దరు
అమరావతి: మొంథా తుఫాను బారి నుంచి గుంటూరు జిల్లాను కాపాడటంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా,ఎస్పీ వకుల్ జిందాల్ కీలక పాత్ర పోషించారు. తుఫాను అలెర్ట్ మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అటు అధికారులను ఇటు ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా అధికారులు సిబ్బంది తుఫాను తీవ్రత తగ్గించటంలో సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
