చిన్నారుల సంరక్షణ వసతి గృహాలను నిబద్ధతతో నిర్వహించాలి : కలెక్టర్ హిమాన్షు శుక్ల
చిన్నారుల సంరక్షణ వసతి గృహాలను నిబద్ధతతో నిర్వహించాలి
జువెనైల్ చట్టం ప్రకారం పిల్లలకు మెరుగైన భద్రత, ఆరోగ్యం, విద్య, ఆహారం అందించాలి
నెల్లూరు: జిల్లాలో చిన్నారుల సంరక్షణ వసతి గృహాలను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలోని 30 చైల్డ్ కేర్ హోమ్స్ కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం ప్రతి చైల్డ్ కేర్ హోమ్ ను అన్ని అవసరమైన వసతులతో పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆహారం, మానసిక అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు వారి భవిష్యత్తుకు భరోసాగా నిలవాలని ఈ సందర్భంగా చైల్డ్ కేర్ హోమ్ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు.
అనంతరం ‘‘దత్తత మాసం’’ కార్యక్రమంలో భాగంగా 
దత్తతపై అవగాహన కల్పించే పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి హేనాసుజున్, జిల్లా ప్రొబేషన్ అధికారి ఫరూక్ బాషా ,జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, సుమలత, సమత, మిషన్ వాత్సల్య సిబ్బంది, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
