టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి సుబ్బానాయుడు క్షేమంగా తిరిగి వస్తారనుకున్నానని, కానీ ఆయన అకాలమృతిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సుబ్బానాయుడు శక్తివంచన లేకుండా కృషి చేశారని కొనియాడారు. నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్ధించారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

