డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే.. ఇక జైలే
తెలంగాణ: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. డ్రంకెన్ డ్రైవ్ ఫై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజీ చేసి, రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
పబ్లు, పార్టీలకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్లను వెంట తీసుకురావాలని సూచించారు.
