నిరంతర స్ఫూర్తి మంత్రం..’వందేమాతరం’
నిరంతర స్ఫూర్తి మంత్రం..’వందేమాతరం’




జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘వందేమాతరం’ రచించి 150 వ వార్షికోత్సవం సందర్బంగా సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు.
కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘వందేమాతరం’ సామూహిక గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. మహాకవి బంకిమ్ చంద్ర చటర్జీ రచించి స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి నేటి తో 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్, డి.పి.ఓ సిబ్బంది అంతా ఏకమై వందేమాతరం గీతాన్ని ఆలపించారు. సిబ్బందిలో జాతీయత భావాన్ని, ఐక్యతను మరింత పెంపొందేలా చేసింది. భారత్ మాతా కి జై …అంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది నినదించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) ప్రకాష్ బాబు అడిషనల్ ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, ఆర్.ఐ లు శివరాముడు, సోమశేఖర్ నాయక్, టైటస్, శ్రీశైల రెడ్డి, ఏ.ఓ వెంకటరమణ, ఆర్.ఎస్.ఐ లు, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.
