నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
తెలంగాణ: హైదరాబాద్ ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీనగర్లో విషాదం చోటుచేసుకుంది. అక్కా చెల్లెళ్లు ఇద్దరు నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు ఊరెళ్లగా పశువులకు నీళ్లు తాపడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు గుంతలో పడి మృతి చెందారు. అంకుషాపూర్కు చెందిన కొండల మల్లేష్ కుమార్తెలు హరిణి(16), గాయత్రి(13)లు గుర్తించారు. మృతి చెందిన కుమార్తెలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
