ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించాలి
ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించాలి
నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్
నెల్లూరు: మొంథా తుఫాను నేపథ్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సహాయం కోసం ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించాలని,కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న సిబ్బందిని జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ ఆదేశించారు.
మొంథా తుఫాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి యువరాజ్ అధికారులతో సమీక్షాసమావేశానికి ముందు ప్రజలకు సహాయం అందించేందుకు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన సహాయం కోసం ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించాలని, సమస్యను పూర్తిగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూంతో పాటు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని.
భారీవర్షాలకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని ఆయా రెవెన్యూ డివిజన్ల కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రజలకు సూచించామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక అధికారి యువరాజ్ కు తెలిపారు.
జిల్లా కలెక్టరు కార్యాలయంతో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699,
కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, : 7601002776
ఆర్డీవో కార్యాలయం, నెల్లూరు : 9849904061
ఆర్డీవో కార్యాలయం, ఆత్మకూరు : 9100948215
ఆర్డీవో కార్యాలయం, కావలి : 7702267559
