ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం (PMSS)ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ హిమాన్షు శుక్ల

0

నెల్లూరు: మాజీ సైనికులు, మాజీ కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు వారి వితంతువుల పిల్లలకు ఉన్నత వృత్తి విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం (PMSS)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

సూచించారు.

జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా సైనిక్ బోర్డు సభ్యులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సైనిక్ బోర్డు చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించే మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం (PMSS)లో భాగంగా బాలురకు నెలకు రూ. 2,500, బాలికలకు రూ.3,000 అందిస్తారన్నారు. ఇందులో నమోదు చేసుకునేందుకు వారికి అవగాహన కలిగించాలన్నారు. నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉందన్నారు. అదేవిధంగా కేంద్రీయ సైనిక్ బోర్డు, రాష్ట్రీయ సైనిక్ బోర్డు ల ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క మాజీ సైనిక కుటుంబాలకు అందేవిధంగా చర్యలను తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలోని సీతారామపురానికి చెందిన జమ్మూ కాశ్మీర్ లోని లైన్ అఫ్ కంట్రోల్ లో మరణించిన మండ్ల ప్రసాద్ కి సంబంధించిన ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబ సభ్యుల కారుణ్య నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను త్వరితగతిన అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *