భద్రాచలం 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలి : మంత్రి తుమల
భద్రాచలం 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రెండు రాష్ట్రాల సీఎంలకు తుమ్మల లేఖ
ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లేఖ
భద్రాద్రి రాముడు తెలంగాణలో
శ్రీ రాముడి భూములు ఆంధ్రాలో
పరిపాలనా సమస్యలు,గిరిజనుల ఇబ్బందులు
డంపింగ్ యార్డ్ కు సైతం స్థలం లేని దుస్థితి
చారిత్రక అనుబంధం ప్రస్తావించిన మంత్రి తుమ్మల
అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కీలక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని, పునర్విభజన చట్టంలోని ఉభయ రాష్ట్రాల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి తెలుగు ప్రజల ముఖ్యంగా భద్రాద్రి, ఐదు గ్రామాల ప్రజల తీరని వేతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల విన్నవించారు.
పునర్విభజన చట్టంలోని భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాసారు.
