మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విచారణ
తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు
విచారణలో మాజీ డీజీపీకి సిట్ అధికారుల ప్రశ్నలు
ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకరరావును నియమించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
ఈ స్పెషల్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం అప్పటి పోలీస్ బాస్ గా మీకు తెలుసా?
ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీకు ఏ దశలో తెలిసింది?
ప్రైవేటు వ్యక్తులను సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చిందా?
ఇంత కీలకమైన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలతో మీరేమైనా మాట్లాడారా? వారు మీకేమైనా ఆదేశాలు ఇచ్చారా?
ఫోన్ ట్యాపింగ్ అంశం పోలీసు వ్యవస్థకు సంబంధించిన విషయం నాకు తెలియదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం మీ దృష్టిలో ఉందా?
