యువతకు గోల్డెన్ ఛాన్స్..ప్రధానిని కలిసే అవకాశం
యువతకు గోల్డెన్ ఛాన్స్..ప్రధానిని కలిసే అవకాశం
దేశ ప్రధాని నరేంద్ర మోదీని యువత కలిసే అవకాశం కేంద్ర యువజన సర్వీసులశాఖ, క్రీడా మంత్రిత్వశాఖ కల్పిస్తోంది. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026’ పేరిట వారి నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తోంది.
www.mybharat.gov.in వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేయాలి. ఒక్కో రాష్ట్రం నుంచి 2,500 మందిని ఎంపిక చేస్తారు. జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో వారి వినూత్న ఆలోచనలను ప్రధానితో పంచుకునే అవకాశం కల్పిస్తారు.
