రాష్ట్ర న్యాయ,చట్టం, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ రేపు నెల్లూరు రాక
రాష్ట్ర న్యాయ,చట్టం, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ రేపు నెల్లూరు రాక

కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: రాష్ట్ర న్యాయ,చట్టం, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ నెల్లూరు, దగదర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు నెల్లూరు ఆర్అండ్బి అతిథిగృహానికి మంత్రి ఫరూక్ చేరుకుంటారు. గురువారం ఉదయం 8 గంటలకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు దగదర్తికి చేరుకుని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో కలిసి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు దగదర్తి నుంచి నంద్యాలకు బయలుదేరివెళతారు.
