రైతులకు గుడ్ న్యూస్ ఆ రోజుతో వర్షాలకు గుడ్ బై చలికాలం షురూ
TELANGANA: రైతులకు గుడ్ న్యూస్ ఆ రోజుతో వర్షాలకు గుడ్ బై చలికాలం షురూ
రాష్ట్రంలో ఈ ఏడాది భిన్నమైన వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ చివరి వారంలోనూ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా ప్రాంతాల్లో వరదలు సైతం సంభవిస్తున్నాయి. అయితే నవంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ మధ్య చివరి వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. తరవాత నవంబర్ 8 నుండి రాష్ట్రంలో చలికాలం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా నవంబర్ 8 నుండే చలికాలం షురూ అయ్యే అవకాశం ఉందన్నారు. నవంబర్ 8 తరవాత వాతావరణ పరిస్థితులను బట్టి తుఫాన్ లాంటివి ఉంటేనే వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. అలాంటి పరిస్థితి ఉంటే నవంబర్ అయినా డిసెంబర్ అయినా 2,3 రోజులు వర్షం కురుస్తుందని తెలిపారు.
