వరద హెచ్చరిక: కోవూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వరద హెచ్చరిక: కోవూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
నెల్లూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమశిల నుంచి వరద వచ్చే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో పెన్నా తీరం వెంట ఉన్న కోవూరు నియోజకవర్గ ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కోరారు. ఈ మేరకు నేడు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తో ఫోన్లో ఆమె మాట్లాడారు. ప్రజల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు. పెన్నా పొర్లుకట్టలు పలుచోట్ల బలహీనంగా ఉన్నాయని, కట్టల వెంట ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ముప్పు నుంచి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు కూడా వరద, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మార్వోలు, విఆర్వోలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు.
